Share News

చీటింగ్‌ కేసులో ఇద్దరికి ఏడాది జైలు

ABN , Publish Date - Dec 31 , 2024 | 12:09 AM

చీటింగ్‌ కేసులో ఇద్దరు నిందితులకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ పరిగి జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ నాగుల స్వప్న తీర్పు చెప్పినట్లు చెన్‌గోముల్‌ ఎస్‌ఐ మధుసూదనరెడ్డి తెలిపారు.

చీటింగ్‌ కేసులో ఇద్దరికి ఏడాది జైలు

పూడూరు, డిసెంబరు 30, (ఆంధ్రజ్యోతి): చీటింగ్‌ కేసులో ఇద్దరు నిందితులకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ పరిగి జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ నాగుల స్వప్న తీర్పు చెప్పినట్లు చెన్‌గోముల్‌ ఎస్‌ఐ మధుసూదనరెడ్డి తెలిపారు. మండలంలోని చెన్‌గోముల్‌కు చెందిన ఎం.రాంచంద్రారెడ్డి, సత్తార్‌ఖాన్‌లు కలిసి తనను చీటింగ్‌ చేశారంటూ అంగడిచిట్టెంపల్లికి చెందిన షకీల్‌(ఖాజామునిరుద్దీన్‌ అహ్మద్‌) అప్పట్లో ఎస్‌ఐ మక్సూద్‌ అలీకి ఫిర్యాదుచేశాడు. అప్పటి ఎస్‌ఐ చార్జీషీట్‌ వేయగా ఎస్పీ నారాయణరెడ్డి పర్యవేక్షణలో పరిగి డీఎస్పీ శ్రీనివాస్‌, సీఐ శ్రీనివా్‌సరెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐ మధుసూదనరెడ్డి తదితరులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సోమవారం కోర్టు ఇన్‌చార్జి ఆఫీసర్‌ వీరన్న, ఎస్‌ఐ మధుసూదనరెడ్డి, కోర్టు కానిస్టేబుల్‌ శివకుమార్‌ కోర్టులో హాజరుపరిచారు. కేసు పూర్వపరాలు విన్న మెజిస్ట్రేట్‌ నిందితులకు ఒక సంవత్సరం జైలుశిక్ష, రూ.6వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Dec 31 , 2024 | 12:09 AM