Share News

వేర్వేరు చోట్ల ఇద్దరు అదృశ్యం

ABN , Publish Date - Mar 12 , 2024 | 11:44 PM

వేర్వేరు చోట్ల ఇద్దరు అదృశ్యమయ్యారు. గుడికి వెళ్తున్నట్లు చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన వివాహిత మహిళ అదృశ్యమైన ఘటన ఆదిభట్ల పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది.

వేర్వేరు చోట్ల ఇద్దరు అదృశ్యం

గుడికి వెళ్తున్నానని చెప్పి వివాహిత..

ఆదిభట్ల, మార్చి 12 : వేర్వేరు చోట్ల ఇద్దరు అదృశ్యమయ్యారు. గుడికి వెళ్తున్నట్లు చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన వివాహిత మహిళ అదృశ్యమైన ఘటన ఆదిభట్ల పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. సీఐ రాఘవేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పంకజ్‌కుమార్‌ అనే వ్యక్తి భార్య అనూషతో కలిసి బాలాపూర్‌ మండలం నాదర్‌గుల్‌లోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ సమీపంలో అద్దె ఇంట్లో ఉంటూ సీసీ కెమెరాలు బిగించే పనిచేస్తున్నాడు. అనూష ఐదు వారాలుగా ప్రతీ సోమవారం నల్గొండ జిల్లా నార్కట్‌పల్లిలోని చెర్వుగట్టు దేవాలయానికి వెళ్తోంది. ఈక్రమంలో సోమవారం ఉదయం చెర్వుగట్టుకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లి సాయంత్రం వరకూ తిరిగిరాలేదు. బంధువులు, స్నేహితులను విచారించినా ఆచూకీ దొరకలేదు. అయితే, ఆమె 93470 63425 నెంబర్‌తో రోజూ ఫోన్‌ మాట్లాడుతుండేదని.. ఆ నెంబర్‌ ఎవరిదో తెలియదని, ఆ వ్యక్తిపై అనుమానముందని భర్త ఫిర్యాదు చేశాడు.

ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిన బాలిక..

ఇంట్లోవారికి చెప్పకుండా బయటకు వెళ్లిన బాలిక అదృశ్యమైన ఘటన ఆదిభట్ల పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. సీఐ రాఘవేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రమావత్‌ చందు భార్య ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆదిభట్ల మున్సిపాలిటీ బొంగ్లూరు గేటు సమీపంలో నివాసముంటూ కూలి పనులు చేస్తుంటాడు. ఈక్రమంలో నవీన్‌ అనే బాలుడు పెద్ద కుమార్తెతో తరచూ మాట్లాడుతూ ఇబ్బంది పెడుతున్నాడని తెలిసి మందలించాడు. అతనిలో మార్పు రాకపోవడంతో బొంగ్లూరు పరిధిలోని మెట్రోసిటీలో అద్దె ఇంటికి మారాడు. సోమవారం ఉదయం 6గంటలకు ఇంట్లోంచి వెళ్లిన బాలిక సాయంత్రం వరకూ తిరిగి రాలేదు. బంధువులు, స్నేహితులను విచారించినా ఫలితం లేకపోయింది. తండ్రి చందు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Updated Date - Mar 12 , 2024 | 11:44 PM