వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
ABN , Publish Date - Dec 27 , 2024 | 12:02 AM
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటనలు బొంరా్‌సపేట్, శామీర్‌పేట్ పరిధిలో చోటుచేసుకున్నాయి.

బొంరా్‌సపేట్/ మూడుచింతపల్లి, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటనలు బొంరా్‌సపేట్, శామీర్‌పేట్ పరిధిలో చోటుచేసుకున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. బొంరా్‌సపేట్ మండలం బుర్రితండాకు చెందిన కేతావత్ లోక్యానాయక్(45), బుజ్జిబాయి భార్యాభర్తలు. వీరిద్దరూ బుధవారం రాత్రి భోజనం చేసిన తర్వాత రాత్రి 11:30 గంటల సమయంలో పొలం దగ్గర ఉన్న వేరుశనగ కల్లం దగ్గరికి కాపల కోసం నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో చెక్‌పోస్టు సమీపంలో 163వ జాతీయ రహదారి దాటుతుండగా పరిగి వైపు నుంచి వస్తున్న గుర్తుతెలియని బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో లోక్యానాయక్‌కు తీవ్రగాయాలు కావడంతో గమనించిన కుటుంబసభ్యులు అతడిని పరిగి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు వికారాబాద్‌కు రెఫర్ చేయగా మార్గమధ్యలో లోక్యానాయక్ మృతిచెందాడు. భార్య బుజ్జిబాయికి స్వల్పగాయాలయ్యాయి. వీరికి ఇద్దరు కూతుళ్లు, కుమారులు ఉన్నారు. బుజ్జిబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అబ్దుల్ రవూఫ్ తెలిపారు. మరో ప్రమాదం శామీర్‌పేట్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన బస్సు గురువారం రాత్రి బైక్‌ను ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే.. మూడుచింతలపల్లి మండలం కొల్తూర్ గ్రామానికి చెందిన నల్ల గణేష్(23) కాంగ్రెస్ పార్టీ మండల కోర్డినేటర్‌గా జగగంగూడలోని ఆల్ఫామెడ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా కేశవరం శివారు ప్రాంతంలో బైక్‌పై వెళ్తున్న క్రమంలో కంపెనీకి చెందిన టీఎస్ 07 యూఈ 8562 బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయాలపాలైన యువకుడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.