Share News

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

ABN , Publish Date - Jan 17 , 2024 | 12:10 AM

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటనలు మేడ్చల్‌, బొంరా్‌సపేట్‌ మండలాల పరిధిలో చోటుచేసుకున్నాయి.

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

మేడ్చల్‌టౌన్‌, జనవరి 16: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటనలు మేడ్చల్‌, బొంరా్‌సపేట్‌ మండలాల పరిధిలో చోటుచేసుకున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లంపేట గ్రామ నివాసి సైదులు సోమవారం తన బైక్‌పై మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం కాళ్లకల్‌ గ్రామానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో ఎల్లంపేట శివారులోని సంగం హెల్త్‌ కేర్‌ పరిశ్రమ సమీపంలో జాతీయ రహదారిపై వెనుకనుంచి వస్తున్న కారు బలంగా ఢీకొంది. దీంతో బైక్‌పై ఉన్న సైదులు పడిపోయి తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

బొంరా్‌సపేట్‌: మండల శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. బొంరా్‌సపేట్‌కు చెందిన వినయ్‌కుమార్‌(45) బురాన్‌పూర్‌కు చెందిన బంధువు మృతిచెందగా అంత్యక్రియలకు హాజరై తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ క్రమంలో అతడి బైక్‌ను కారు ఢీకొంది. దీంతో వినయ్‌కుమార్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శంకర్‌ తెలిపారు.

Updated Date - Jan 17 , 2024 | 12:10 AM