Share News

ఇద్దరు చైన్‌ స్నాచర్ల రిమాండ్‌

ABN , Publish Date - May 30 , 2024 | 12:12 AM

బెట్టింగ్‌లకు అలవాటు పడి చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరిని పోచారం ఐటీసీ పోలీసులు అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కు తరలి ంచారు.

ఇద్దరు చైన్‌ స్నాచర్ల రిమాండ్‌

ఘట్‌కేసర్‌ రూరల్‌, మే 29: బెట్టింగ్‌లకు అలవాటు పడి చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరిని పోచారం ఐటీసీ పోలీసులు అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కు తరలి ంచారు. సీఐ రాజువర్మ తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లి జిల్లా రేగొండ మం డలం కోటంచకు చెందిన చెనుమల్ల ప్రశాంత్‌(32) క్యాబ్‌ డ్రైవింగ్‌ చేస్తూ నాగోల్‌లో అద్దెకుంటున్నాడు. భూపాలపల్లికి చెందిన దండిగన్‌ సాయి కమల్‌(32) క్యాబ్‌ డ్రైవింగ్‌ చేస్తూ పీర్జాదిగూడలో అద్దెకుంటున్నాడు. వీరిద్దరూ స్నేహితులయ్యారు. బెట్టింగ్‌లకు అలవాటు పడ్డారు. డబ్బుల కోసం చైన్‌ స్నాచింగ్‌లను ఎంచుకున్నారు. ఈ నెల 23న ఎన్‌ఎఫ్‌సీనగర్‌కు చెందిన ఎర్రి శ్రీజ ఆమె తల్లి సునీతతో కలిసి జోడిమెట్ల తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌కు వెళ్లి స్కూటర్‌(టీఎస్‌08 జీటీ 2922)పై తిరి గి వస్తున్నారు. అన్నోజిగూడ డీమార్టు సమీపంలో వెనక నుంచి ప్రశాంత్‌, కమల్‌ బైక్‌(టీఎస్‌07 హెచ్‌జీ9526)పై వచ్చి శ్రీజ మెడలోని తులం బంగా రు చైన్‌ లాక్కొని పరారయ్యారు. తల్లీ కూతుళ్లు కిందపడటంతో గాయాలయ్యాయి. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. సీసీ ఫుటేజీల ఆధారంగా దొంగల కనుగొన్నారు. 28న సాయంత్రం ప్రశాంత్‌, సాయికమల్‌ బైక్‌పై యంనంపే ట్‌ చౌరస్తా వద్ద తిరుగుతుండటంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తులం బంగారు చైన్‌, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఇద్దరిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వివరించారు.

Updated Date - May 30 , 2024 | 09:44 AM