ఎదురెదురుగా రెండు కార్లు ఢీ
ABN , Publish Date - Jun 27 , 2024 | 12:17 AM
రెండు కార్లు ఎదురు ఎదురుగా ఢీకొన్న సంఘటన మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధి షాపూర్ గేట్ వద్ద బుధవారం చోటుచేసుకుంది. పోలీ్‌సలు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

ముగ్గురికి గాయాలు
మొయినాబాద్, జూన్ 26 : రెండు కార్లు ఎదురు ఎదురుగా ఢీకొన్న సంఘటన మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధి షాపూర్ గేట్ వద్ద బుధవారం చోటుచేసుకుంది. పోలీ్‌సలు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై చేవెళ్ల నుంచి స్విఫ్ట్ కారు హైదరాబాద్ వెళ్తుంది. మార్గమద్యలో మొయినాబాద్ మండల పరిధి షాపూర్ గేట్ సమీపంలోకి రాగానే హైదాబాద్ నుంచి చేవెళ్ల వస్తున్న కారు అతివేగంగా రావడంతో రెండు కార్లు బలంగా ఢీకొన్నాయి. ప్రమాదంలో కార్లు ధ్వసం అయ్యాయి. నగరానికి చెందిన కారులో ఉన్న ముగ్గురికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు మొయినాబాద్ పోలీ్‌సలు సంఘటన స్థంలకు చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీ్‌సలు తెలిపారు.