రెండు కార్లు ఢీ.. 8 మందికి గాయాలు
ABN , Publish Date - Aug 21 , 2024 | 12:19 AM
మండల పరిధి కోనాపూర్ గేటు వద్ద హైదరాబాద్-శ్రీశైలం రహదారిపై ఎదురెదురుగా రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో 8 మంది గాయపడ్డారు.
ఆమనగల్లు, ఆగస్టు 20: మండల పరిధి కోనాపూర్ గేటు వద్ద హైదరాబాద్-శ్రీశైలం రహదారిపై ఎదురెదురుగా రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో 8 మంది గాయపడ్డారు. కార్లలో బెలూన్లు ఓపెన్ కావడంతో ప్రాణాపాయం తప్పింది. హైదరాబాద్ నుంచి కల్వకుర్తి వైపు వెళ్తున్న కారు ఎదురుగా అచ్చంపేట నుంచి హైదరాబాద్ వెళ్తున్న మరో కారు ఢీకొన్నాయి. హైదరాబా ద్ వైపు వెళ్తున్న కారులో ఐదుగురు స్వల్పంగా, అచ్చంపేట వైపు వెళ్తున్న కారులోని ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వివిధ ఆస్పత్రులకు తరలించారు. క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటనా స్థలాన్ని ఎస్‌ఐ వెంకటేశ్వర్లు సందర్శించి వివరాలు సేకరించారు.