Share News

రెండు బైక్‌లు ఢీ.. వ్యక్తి మృతి

ABN , Publish Date - Aug 21 , 2024 | 11:57 PM

నందిగామలోని బైపాస్‌ రోడ్డులో రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది.

రెండు బైక్‌లు ఢీ.. వ్యక్తి మృతి

నందిగామ, అగస్టు 21: నందిగామలోని బైపాస్‌ రోడ్డులో రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌ మండలం లిబ్యా తండాకు చెందిన నెనావత్‌ చందు(47) బైక్‌పై భా ర్య జ్యోతితో కలసి నందిగామ నుంచి రాంగ్‌రూట్లో షాద్‌నగర్‌ వెళ్తున్నాడు. ఎంఎ్‌సఎన్‌ పరిశ్రమ సమీపంలో షాద్‌నగర్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న మరో బైక్‌ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో చందు రోడ్డుపై పడడంతో హైదరాబాద్‌ వైపు వెళ్తున్న లారీ టైర్‌ చందుపై తలపై నుంచి వెళ్లింది. దీంతో చందు అక్కడికక్కడే మృతిచెందాడు. జ్యోతి, మరో బైక్‌పై ఉన్న యువకుడికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి, మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. చందు భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై గోపాలక్రిష్ణ తెలిపారు.

Updated Date - Aug 21 , 2024 | 11:57 PM