ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీ.. వ్యక్తి మృతి
ABN , Publish Date - Dec 27 , 2024 | 11:48 PM
రెండు బైక్‌లు ఎదెరెదురుగా ఢీ కొన్న ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. శుక్రవారం సాయంత్రం చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీ్‌సల కథనం మేరకు.. వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని అంగడిచిట్టెంపల్లికి చెందిన మల్గాని రాజమల్లయ్య (55) శుక్రవారం పని నిమిత్తం చేవెళ్ల మండల కేంద్రానికి వచ్చి తిరిగి సాయంత్రం స్వగ్రామానికి బైక్‌పై బయలుదేరాడు.

చేవెళ్ల, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): రెండు బైక్‌లు ఎదెరెదురుగా ఢీ కొన్న ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. శుక్రవారం సాయంత్రం చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీ్‌సల కథనం మేరకు.. వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని అంగడిచిట్టెంపల్లికి చెందిన మల్గాని రాజమల్లయ్య (55) శుక్రవారం పని నిమిత్తం చేవెళ్ల మండల కేంద్రానికి వచ్చి తిరిగి సాయంత్రం స్వగ్రామానికి బైక్‌పై బయలుదేరాడు. చేవెళ్ల మండల పరిధిలోని ఇక్కరెడ్డిగూడ గ్రామానికి చెందిన పి.రామస్వామి, భార్య మాధవిలు బైక్‌పై వికారాబాద్ నుంచి చేవెళ్ల మీదుగా ఇంటికి వస్తున్నారు. ఈక్రమంలో ఖానాపూర్-మీర్జాగూడ స్టేజీల మధ్యలో రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. రాజమల్లయ్య తలకు రక్తగాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. పి.రామస్వామి, భార్య మాధవిలు తీవ్రంగా గాయపడటంతో స్థానికులు అంబులెన్స్‌లో చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు పోలీ్‌సలు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.