మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు
ABN , Publish Date - Dec 31 , 2024 | 12:07 AM
మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను కీసర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కీసర రూరల్, డిసెంబర్ 30(ఆంధ్రజ్యోతి): మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను కీసర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన సోమవారం కీసర పోలీ్‌సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ వెంకటయ్య తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రాజస్థాన్‌కు చెందిన కరణ్‌సింగ్ కుషాయిగూడలో నివాసముంటూ రాజ్‌పుత్‌దాబాలో అతడి మిత్రుడు రాకే్‌షమంజు బార్సిలాల్ రెయిలింగ్ పనిచేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. జల్సాలకు బానిసైన వారు మత్తుపదార్థాల విక్రయాలను ఎంచుకున్నారు. అందులో భాగంగా వారు పాప్పిస్ట్రా మత్తుపదార్థాన్ని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు కీసర పోలీసులు, ఎస్‌వోటీ పోలీసులు సంయుక్తంగా కీసర మండలంలోని యద్గార్‌పల్లి వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2.2కేజీల పాప్పిస్ట్రా మత్తు పధార్థాన్ని, రెండుఫోన్లు, టాటా ఏస్ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.