Share News

నాగారంలో ట్రక్కు బోల్తా

ABN , Publish Date - Jan 14 , 2024 | 12:05 AM

నాగారం మున్సిపాలిటీ ప్రధాన రహదారిలో శనివారం తెల్లవారుజామున భారీ ట్రక్కు బోల్తాపడింది. ట్రక్కులోని ఇనుప స్తంభాలు రోడ్డుపైన పడిపోయాయి.

నాగారంలో ట్రక్కు బోల్తా
ట్రక్కు బోల్తాపడడంతో రోడ్డుపై పడిపోయిన ఇనుప స్తంభాలు

కీసర రూరల్‌, జనవరి 13: నాగారం మున్సిపాలిటీ ప్రధాన రహదారిలో శనివారం తెల్లవారుజామున భారీ ట్రక్కు బోల్తాపడింది. ట్రక్కులోని ఇనుప స్తంభాలు రోడ్డుపైన పడిపోయాయి. ట్రాఫిక్‌ తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. కుషాయిగూడ నుంచి కీసర వైపునకు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో కీసర వైపునకు వచ్చే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్డుపై పడిపోయిన ఇనుప స్తంభాలను క్రేన్‌ సాయంతో మరో లారీలోకి లోడ్‌ చేసి, ప్రమాదానికి గురైన ట్రక్కును అక్కడి నుంచి తరలించారు.

Updated Date - Jan 14 , 2024 | 12:05 AM