కలెక్టరేట్‌లో ముగ్గుల పోటీలు
ABN , Publish Date - Jan 12 , 2024 | 11:55 PM
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టరేట్‌లో శుక్రవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు.

మేడ్చల్, జనవరి 12(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టరేట్‌లో శుక్రవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో వివిధ శాఖల మహిళా అధికారులు, సిబ్బంది పాల్గొని ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీలను డీఆర్‌వో హరిప్రియ, ఏవో రామ్మోహన్‌లు ప్రారంభించి పరిశీలించారు. ముగ్గుల పోటీలో ప్రతిభ కనబరిచిన వారికి జనవరి 26న గణతంత్ర వేడుకల సందర్భంగా బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు.