Share News

చెట్ల నరికివేతతో మానవాళికి ముప్పు

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:35 PM

అడవులు ప్రజల సంపదని, చెట్ల నరికివేతతోఓ భవిష్యత్తులో మానవాళికి ముప్పు వాటిల్లుతుందని జిల్లా అటవీశాఖ అధికారి జ్ఞానేశ్వర్‌ అన్నారు.

చెట్ల నరికివేతతో మానవాళికి ముప్పు
తండావాసులతో మాట్లాడుతున్న డీఎ్‌ఫవో జ్ఞానేశ్వర్‌

  • జిల్లా అటవీశాఖ అధికారి జ్ఞానేశ్వర్‌

ధారూరు, ఏప్రిల్‌ 25: అడవులు ప్రజల సంపదని, చెట్ల నరికివేతతోఓ భవిష్యత్తులో మానవాళికి ముప్పు వాటిల్లుతుందని జిల్లా అటవీశాఖ అధికారి జ్ఞానేశ్వర్‌ అన్నారు. ధారూరు అటవీరేంజ్‌ పరిధిలోని సంగాయపల్లి, బాణాలపూర్‌ అటవీ ప్రాంతంలో అటవీ భూములను ఆక్రమించుకుంటున్నారని అందిన ఫిర్యాదులతో సంగాయపల్లి రిజర్వు ఫారెస్టును తనిఖీ చేసిన అనంతరం తండా వాసులతో సమావేశమై అవగహన కల్పించారు. అడవుల్లో చెట్లను నరికి అడవిని అక్రమించుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట ఇన్‌చార్జి రేంజర్‌ ఆరుణ, సెక్షన్‌ అధికారి మోయినొద్దీన్‌, బీట్‌ అధికారి అనంద్‌లు ఉన్నారు. కాగా అవగహన సమావేశంలో సెక్షన్‌ అధికారి మోయినోద్దిన్‌ అవినీతిపై సంగాయపల్లి తండా వాసులు డీఎ్‌ఫవోకు పిర్యాదు చేశారు. అటవీ భూమిని ఆక్రమించుకున్నారని, పంటలు వేశారని బెదిరించి తమ వద్ద వేలాది రూపాయల డబ్బులను సెక్షన్‌ అధికారి వసూలు చేశాడని ఆరోపించారు. గొర్రె, మేకపోతులను తీసుకెళ్లాడని తండావాసులు డీఎ్‌ఫవో జ్ఞానేశ్వర్‌కు వివరించారు. తండావాసులంతా మూకుమ్మడిగా సెక్షన్‌ అధికారి అవినీతిపై ఫిర్యాదు చేయటంతో డీఎ్‌ఫవో అవాక్కచి విస్మయానికి గురయ్యారు. దీంతో సెక్షన్‌ అధికారి మొయినొద్దీన్‌పై డీఎ్‌ఫవో ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్షన్‌ అధికారిపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపిస్తామని, వాస్తవమని తేలితే ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డీఎ్‌ఫవో తండావాసులకు హామీ ఇచ్చారు. కాగా సెక్షన్‌ అధికారి మొయినొద్దీన్‌ అడవిలో నుంచి పెద్దఎత్తున మొరం, ఇసుకను తరలించి ధారూరులో నిల్వ చేశాడనే ఫిర్యాదులు అందాయని, దీనిపై విచారణ చేపడతామని డీఎఫ్‌వో చెప్పారు.

Updated Date - Apr 25 , 2024 | 11:35 PM