Share News

మైసిగండి మైసమ్మ ఆలయం వద్ద ట్రాఫిక్‌ సమస్య తీవ్రం

ABN , Publish Date - May 20 , 2024 | 12:04 AM

మండల పరిధి మైసిగండి మైసమ్మ ఆలయం వద్ద ట్రాఫిక్‌ సమస్య రోజురోజుకూ తీవ్రమమైతోంది.

మైసిగండి మైసమ్మ ఆలయం వద్ద ట్రాఫిక్‌ సమస్య తీవ్రం
మైసమ్మ ఆలయం వద్ద రహదారిపై స్తంభించిన ట్రాఫిక్‌

ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు

పట్టించుకోని టాఫిక్‌ పోలీసులు

కడ్తాల్‌, మే 19 : మండల పరిధి మైసిగండి మైసమ్మ ఆలయం వద్ద ట్రాఫిక్‌ సమస్య రోజురోజుకూ తీవ్రమమైతోంది. హైదరాబాద్‌-శ్రీశైలం జాతీయ రహదారిపై ఆలయం వద్ద ట్రాఫిక్‌ సమస్యతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. సమస్య పరిష్కారానికి ట్రాఫిక్‌ పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు. ప్రతి ఆది, మంగళ, గురు వారాల్లో మైసమ్మ ఆలయానికి వందలాదిగా భక్తులు వస్తుంటారు. జాతీయ రహదారి నుంచి ఆలయంలో హైదరాబాద్‌, కల్వకుర్తిల వైపు నుంచి భక్తుల వాహనాలు మళ్లే క్రమంలో ట్రాఫిక్‌ స్తంభిస్తోంది. నియంత్రణ చేయక వందలాది వాహనాలు ఆలయం వద్ద హైవేపై నిలిచిపోతున్నాయి. తరుచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆలయంలోకి మల్లే ప్రధాన ద్వారం సమీపంలోనే బస్టాప్‌ ఉంది. అక్కడే ప్రయాణికుల కోసం వాహనాలు నిలుపుతున్నారు. దీంతో వారంలో మూడు రోజులు ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పడం లేదు. పేరుగాంచిన మైసిగండి ఆలయం వద్ద భక్తుల రద్దీ నేపథ్యంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు, ప్రయాణికులు కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆలయం వద్ద రద్దీ ఉండే రోజుల్లో ట్రాఫిక్‌ పోలీసులను నియమించి ఇబ్బందులు లేకుండా చూడాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు.

Updated Date - May 20 , 2024 | 12:04 AM