Share News

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ పట్టివేత

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:32 PM

ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకున్నట్లు ఎస్‌ఐ భరత్‌రెడ్డి తెలిపారు.

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ పట్టివేత

కొడంగల్‌ రూరల్‌, ఏప్రిల్‌ 25: ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకున్నట్లు ఎస్‌ఐ భరత్‌రెడ్డి తెలిపారు. యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్‌ నుంచి కొడంగల్‌ మీదుగా గురువారం ఇసుకను తరలిస్తుండగా కానిస్టేబుల్‌లు నరేందర్‌ రెడ్డి, సమీవుద్దీన్‌లు ట్రాక్టర్‌ను ఆపి ఇసుక తరలింపునకు అనుమతి పత్రాలు చూయించాలని అడిగారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తుండటంతో పట్టుకుని కొడంగల్‌ పోలీ్‌సస్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు. ట్రాక్టర్‌ డ్రైవర్‌ ఎండీ ఇమ్రాన్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Apr 25 , 2024 | 11:32 PM