Share News

కలప తరలిస్తున్న లారీ పట్టివేత

ABN , Publish Date - Jan 14 , 2024 | 12:04 AM

అనుమతులు లేకుండా కలప తరలిస్తున్న లారీని పట్టుకున్నట్లు చెన్‌గోముల్‌ ఎస్‌ఐ గిరి తెలిపారు.

కలప తరలిస్తున్న లారీ పట్టివేత
పట్టుబడిన కలప లారీ

పూడూరు, జనవరి 13: అనుమతులు లేకుండా కలప తరలిస్తున్న లారీని పట్టుకున్నట్లు చెన్‌గోముల్‌ ఎస్‌ఐ గిరి తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కండ్లపల్లి గేటు వద్ద శుక్రవారం రాత్రి పోలీసులు నగేష్‌, మల్లే్‌షలు గస్తీ నిర్వహిస్తున్నారు. అదే సమయంలో కొడంగల్‌ నుంచి హైదరాబాద్‌ వైపు వెళుతున్న ఓ లారీని ఆపి తనిఖీ చేశారు. లారీలో కలపను గుర్తించారు. అనుమతి పత్రాలు లేకపోవడంతో లారీ డ్రైవర్‌ మహ్మద్‌ ఖలీల్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Jan 14 , 2024 | 12:04 AM