పనిచేసే సంస్థకే టోకరా
ABN , Publish Date - Aug 24 , 2024 | 11:30 PM
పనిచేసే సంస్థకే టోకరాపెట్టిన వ్యక్తిపై పోచారం ఐటీసీ పోలీసులు కేసునమోదు చేశారు.
ఘట్‌కేసర్ రూరల్, ఆగస్టు 24: పనిచేసే సంస్థకే టోకరాపెట్టిన వ్యక్తిపై పోచారం ఐటీసీ పోలీసులు కేసునమోదు చేశారు. సీఐ రాజువర్మ తెలిపిన వివరాల ప్రకారం. పోచారం మున్సిపాలిటీ, అన్నోజిగూడలోని రిలయన్స్ రిటైల్ సూపర్‌మార్కెట్‌లో పిన్నగాని రంజిత్‌కుమార్ ఆరు సంవత్సరాలుగా క్లష్టర్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. కాగా సూపర్‌మార్కెట్‌లో ఎక్కువ వస్తువులను విక్రయించి తక్కువ వస్తువులు విక్రయించినట్లు బిల్లువేసి తప్పుదోవ పట్టించాడు. పాలు ఉత్పత్తులు, పండ్లు, ఆహార, కూరగాయాలతో పాటు పలు రకాల వస్తువులను తన కుటుంబసభ్యులకు, స్నేహితులకు బిల్లింగ్ చేయకుండానే పంపించేవాడు. అనుమానం వచ్చిన సూపర్‌మార్కెట్ యజమాని గత ఏప్రిల్ నెలలో ఆడిట్ చేయగా రూ.7,48,089 నగదు దుర్వినియోగమైనట్లు గ్రహించి రంజిత్‌కుమార్‌పై పోచారం ఐటీసీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.