Share News

ప్రజలకు ఉపయోగపడేలా సేవలందించాలి

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:35 AM

ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నత స్థానంలో ఉండి ప్రజలకు ఉపయోగపడే విధంగా సేవలందించడం అదృష్టంగా భావించాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అన్నారు.

ప్రజలకు ఉపయోగపడేలా సేవలందించాలి
ట్రైనీ కలెక్టర్‌ అమిత్‌ నారాయణను సన్మానిస్తున్న నారాయణరెడ్డి

వికారాబాద్‌, ఏప్రిల్‌ 26 : ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నత స్థానంలో ఉండి ప్రజలకు ఉపయోగపడే విధంగా సేవలందించడం అదృష్టంగా భావించాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయంలో ట్రైనీ కలెక్టర్‌గా శిక్షణ పూర్తిచేసుకొని వెళ్తున్న అమిత్‌నారాయణకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ తెలంగాణ క్యాడర్‌లో మంచి పోస్టింగ్‌ ఇచ్చి, ప్రభుత్వ ఉద్యోగిగా సర్వీస్‌ చేయడం అదృష్టమని, ప్రజలకు ఉపయోగపడేలా నిర్ణయాలుండాలని, ప్రభుత్వ ఉద్యోగిగా విధుల్లో చేరినప్పటి నుంచి ఉద్యోగ విరమణ పొందే వరకు అదే చిరునువ్వుతో పనిచేయాలన్నారు. అసోసియేషన్‌, మీడియా, ఉద్యోగులను కలుపుకొని ఫ్రెండ్లీగా విధులు నిర్వర్తించేలా ముందుకెళ్లాలని, సర్వీసుతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కుటుంబ సభ్యులను చూసుకోవాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ విషయంలో మంచి సేవలు అందించారని, ఇంకా ఉన్నత పదవులు చేపట్టి ప్రజలకు సేవలందించాలని, జిల్లాను గుర్తుపెట్టుకోవాలని అన్నారు. అమిత్‌నారాయణ మాట్లాడుతూ కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఏ సమస్య రాకుండా శిక్షణ పూర్తిచేసుకున్నానని, తాను మొదట ధారూర్‌ మండలం ఎంపీడీవోగా చేశానని, రెవెన్యూ సర్వీసు తెలుసుకోవడం, పోస్టల్‌ బ్యాలెట్‌ నిర్వహించడంతో మంచి అనుభవం వచ్చిందని, అందరికీ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాకు కొత్తగా ట్రైనీ కలెక్టర్‌గా వచ్చిన ఉమాహారతికి స్వాగతం తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాహుల్‌శర్మ, లింగ్యానాయక్‌, ఆర్డీవోలతో సాన్నిహిత్యాన్ని ట్రైనీ కలెక్టర్‌ గుర్తు చేసుకున్నారు.

Updated Date - Apr 27 , 2024 | 12:35 AM