Share News

ముట్పుర్‌ శివారులో చెట్లు నరికేసిన దుండగులు

ABN , Publish Date - Jun 12 , 2024 | 12:05 AM

మండల పరిధిలోని ముట్పుర్‌ గ్రామ శివారు గ్రామమైన చుక్కమెట్టు గుట్టపై పెంచిన చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు నరికేశారు.

ముట్పుర్‌ శివారులో చెట్లు నరికేసిన దుండగులు

కొందుర్గు, జూన్‌, 11: మండల పరిధిలోని ముట్పుర్‌ గ్రామ శివారు గ్రామమైన చుక్కమెట్టు గుట్టపై పెంచిన చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు నరికేశారు. అటవీశాఖ ఆధ్యర్యంలో గుట్టపై చెట్లను పెంచడం జరిగిందని, వీటిలో దాదాపు 20 చెట్లను గత రెండు రోజులుగా ఎలాంటి అనుమతులు లేకుండా కొంత మంది నరికివేశారని చుక్కమెట్‌ గ్రామస్థులు మంగళవారం తెలిపారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి మిగితా చెట్లను కాపాడాలని గ్రామస్థులు అధికారులను కోరారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి శివకుమార్‌ను సంప్రదించగా, ఉన్నతాధికారులకు విషయం తెలియజేసి, ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

Updated Date - Jun 12 , 2024 | 09:25 AM