Share News

వేర్వేరు చోట్ల ముగ్గురి ఆత్మహత్య

ABN , Publish Date - Aug 19 , 2024 | 12:17 AM

జిల్లాలో వేర్వేరు చోట్ల ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు.

వేర్వేరు చోట్ల ముగ్గురి ఆత్మహత్య

కేశంపేట, ఆగస్టు 18: జిల్లాలో వేర్వేరు చోట్ల ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటలన వివరాలు ఇలా ఉన్నాయి. జీవితంపై విరక్తితో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని వేముల్‌నర్వలో చోటుచేసుకుంది. కేశంపేట ఎస్‌ఐ రాజ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన డోల రాములు(54) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మద్యానికి బానిసైన రాములు ఉరేసుకుంటా అని కుటుంబీకులతో అంటుండేవాడు. శనివారం ఇంట్లో ఎవరూ లే ని సమయంలో ఉరేసుకున్నాడు. ఆదివారం రాములు అల్లుడు నరసింహ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

ఆర్థిక, కుటుంబ సమస్యలతో యువకుడు...

ఆదిభట్ల: ఆర్థిక, కుటుంబ సమస్యలతో ఆదివారం ఆదిభట్ల పరిధి తుర్కయంజాల్‌లో ఓ యువకుడు ఉరేసుకున్నాడు. సీఐ రాఘవేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఎం.వంశీకృష్ణ(26) తల్లిదండ్రులు లేకపోవడం తో సోదరి భావనతో కలిసి తుర్కయంజాల్‌ ఏవీ నగర్‌లోని సొంత ఇంట్లో ఉంటూ డీటీడీసీలో కొరియర్‌ బాయ్‌గా పనిచేసేవాడు. శనివారం రాత్రి 11గంటలకు ఇంటికొచ్చి స్నానం చేసొస్తానని అక్కతో చెప్పి మేడపైకి వెళ్లాడు. వచ్చి భోజనం చేసి పడుకుండాడని అక్క అనుకొని నిద్రపోయింది. మేడపైకి వెళ్లిన వంశీకృష్ణ రేకుల రూమ్‌లో చున్నీతో ఉరేసుకున్నాడు. ఈ విషయాన్ని ఆదివారం ఉదయం కిరాయికి ఉండే వ్యక్తి లక్ష్మణ్‌ చూసి భావనకు చెప్పాడు. ఆర్థిక, కుటుంబ సమస్యలతో తన తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నట్టు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఒంటరి జీవితాన్ని భరించలేక మరో యువకుడు ...

ఆదిభట్ల: తల్లిదండ్రుల మృతితో ఒంటరి జీవితం, అనారోగ్య సమస్యల తో క్షోభకు గురైన ఓ యువకుడు విషంతాగి ఆత్మహత్య చేసుకున్న ఘట న కుర్మల్‌గూడ ఇందిరమ్మ కాలనీలో ఆదివారం చోటుచేసుకుంది. సీఐ రా ఘవేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హర్షవర్ధన్‌(24) అనే యువకు డు బాలాపూర్‌ మండలం కుర్మల్‌గూడ ఇందిరమ్మ కాలనీలో ఉంటూ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం ఉదయం 4:15గంటలకు కుర్మల్‌ గూడలోనే ఉండే తన మేనమామ మన్నెపల్లి అనిల్‌కు ఫోన్‌చేసి తాను మాత్రలు వేసుకున్నానని చెప్పి ఫోన్‌ కట్‌చేశాడు. అనిల్‌ వెంటనే తన కొ డుకుతో హర్షవర్ధన్‌ రూమ్‌కు చేరుకున్నాడు. అపస్మారక స్థితిలో ఉన్న హర్షవర్ధన్‌ను బాలాపూర్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి చేర్పించాడు. చికిత్స పొం దుతూ శనివారం సాయంత్రం హర్షవర్ధన్‌ మృతిచెందాడు. అతడి తల్లిదం డ్రులు గతంలోనే చనిపోయారు. అతడు వెన్నునొప్పితో బాధపడేవాడు. శనివారమే హర్షవర్ధన్‌ పుట్టినరోజు కావడం, తల్లిదండ్రులను గుర్తుచేసుకొ ని మానసిక క్షోభతో ఆత్మహత్య చేసుకున్నాడని అనిల్‌ పోలీసులకు ఫిర్యా దు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - Aug 19 , 2024 | 12:17 AM