Share News

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

ABN , Publish Date - May 17 , 2024 | 12:34 AM

లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం మూలంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన గురువారం యాచారం పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని మాల్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు..

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం

యాచారం, మే 16 : లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం మూలంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన గురువారం యాచారం పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని మాల్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలోని కోదాబక్ష్‌పల్లికి చెందిన అంతయ్య(60) లూనా వాహనంపై యాచారం నుంచి స్వగ్రామానికి వెళుతున్నాడు. ఈక్రమంలో మహా సిమెంట్‌ కంపెనీకి చెందిన ఓ లారీ లూనాను డీకొట్టింది. దాంతో తీవ్రంగా గాయపడగా.. స్థానికులు మాల్‌లో పీపుల్స్‌ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. డ్రైవర్‌ నిర్లక్ష్యంతోనే ప్రాణాలు కోల్పోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి కుమారుడు లక్ష్మయ్య అనారోగ్యం కారణంగా నెల రోజులుగా నగరంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అంతయ్య మరణంతో వారి కుటుంబం వీధిన పడింది. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని మృతుడి బంధువులు కోరుతున్నారు.

పాంపౌండ్‌లో మునిగి ఒకరు..

తలకొండపల్లి, మే 16: పాంపౌండ్‌లో స్నానానికి వెళ్లిన ఓ వ్యక్తి అందులో మునిగి మృతిచెందిన ఘటన తలకొండపల్లి మండలం చంద్రధన గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబికుల కథనం మేరకు.. చంద్రధన శ్రీ మల్లిఖార్జున బ్రహ్మోత్సవాల సందర్భంగా మహబూబ్‌నగర్‌కు చెందిన భవానిజీ(45) రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. గురువారం తెల్లవారుజామున పొలం వద్ద పాంపౌండ్‌లో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మృతుడు భవానీజీ కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్‌ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో మరొకరు..

కొత్తూర్‌, మే 16: మండల కేంద్రానికి సమీపంలో గల రైల్వే ఫై్ౖలఓవర్‌ బ్రిడ్జి వద్ద కారు బైక్‌ను ఢీకొన్న ఘటనలో ఉల్లిగడ్డల శివ(43) అనే వ్యక్తి మృతిచెందినట్లు ఎస్సై జి.శ్రీనివాస్‌ తెలిపారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినపల్లికి చెందిన శివ గురువారం బైక్‌పై స్వగ్రామానికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న కారు బైక్‌ను ఢీకొనడంతో శివకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడని వైద్యులు ధ్రువీకరించారు. శివ భార్య సువర్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Updated Date - May 17 , 2024 | 09:50 AM