Share News

‘తొలిమెట్టు’ విద్యాబోధన భేష్‌

ABN , Publish Date - Jan 05 , 2024 | 12:03 AM

పాఠశాలలో అమలు చేస్తున్న తొలిమెట్టు విద్యా బోధన బేషుగ్గా ఉందని జడ్పీ చైర్‌పర్సన్‌ పి.సునీతా మహేందర్‌రెడ్డి అన్నారు.

‘తొలిమెట్టు’ విద్యాబోధన భేష్‌

  • జడ్పీచైర్‌పర్సన్‌ అభినందన

ధారూరు, జనవరి 4: పాఠశాలలో అమలు చేస్తున్న తొలిమెట్టు విద్యా బోధన బేషుగ్గా ఉందని జడ్పీ చైర్‌పర్సన్‌ పి.సునీతా మహేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని కాచారం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాద్యారాలు శివాణి, విద్యార్థులలో గురువారం ఆమె వీడియోకాల్‌లో మాట్లాడారు. సులభంగా పాఠాలు అర్థమయ్యేలా ప్రత్యేక పద్ధతుల్లో విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయులను ఈ సందర్భంగా ఆమె అభినందించారు. వీడియోకాల్‌లో ఆమె విద్యార్థులతో మాట్లాడగా టీఎల్‌ఎం పద్ధతిలో విద్యాబోధన బాగుందన్నారు. పాఠాలు బాగా అర్థమవుతున్నాయని విద్యార్థులు తెలిపారు. ఒకటి, రెండో తరగతి విద్యార్థులు ఇంగ్లీషు భాషలో మాట్లాడటం చూసి ఆమె ఆశ్చర్యపోయారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు నాణ్యమైన విద్య పొందుతున్నారనడానికి కాచారం పాఠశాలనే నిదర్శనమని ఆమె అన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయాలని ఆమె ఉపాధ్యాయులకు సూచించారు.

Updated Date - Jan 05 , 2024 | 12:03 AM