Share News

అవి చిరుత పాదముద్రలు కావు

ABN , Publish Date - Feb 15 , 2024 | 12:17 AM

మండల పరిధి ఆటవీ ప్రాంతం లో గుర్తించిన అటవీ జంతువు పాదముద్రలు చిరుతపులివి కా దని ఫారెస్టు అధికారులు ఖాజా, ఫరూక్‌అలీ మంగళవారం తెలిపారు.

అవి చిరుత పాదముద్రలు కావు
అటవీ ప్రాంతంలో జంతువు పాద ముద్రలను గుర్తిస్తున్న అధికారులు

దౌల్తాబాద్‌, ఫిబ్రవరి 14: మండల పరిధి ఆటవీ ప్రాంతం లో గుర్తించిన అటవీ జంతువు పాదముద్రలు చిరుతపులివి కా దని ఫారెస్టు అధికారులు ఖాజా, ఫరూక్‌అలీ మంగళవారం తెలిపారు. వారు బీట్‌ అధికారి ఎండీ వహీద్‌తో కలిసి అటవీ ప్రాంత ంలో గాలించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ.. నాందర్‌పూర్‌నకు చెందిన కొందరు అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తోందనే సమాచారంతో అడవిలో గాలించామన్నారు. అయితే అటవీ జంతువు పాదముద్రలు గుర్తించినా అవి చిరుతవి కాద ని తేల్చారు. హైనా తిరుగుతున్నట్టు అనుమానం వ్యక్తం చేశారు. ప్రజలు భయా ందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.

Updated Date - Feb 15 , 2024 | 12:17 AM