Share News

తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తనీయొద్దు

ABN , Publish Date - Apr 07 , 2024 | 12:58 AM

తాగునీటి సరఫరాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కార్యాచరణ చేపట్టాలని, జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమితులైన రాష్ట్ర రవాణా, ఆర్‌అండ్‌బీ శాఖ స్పెషల్‌ సెక్రటరీ విజయేంద్ర అధికారులకు సూచించారు.

తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తనీయొద్దు
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ప్రత్యేకాధికారి విజయేంద్ర

మేడ్చల్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి) : తాగునీటి సరఫరాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కార్యాచరణ చేపట్టాలని, జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమితులైన రాష్ట్ర రవాణా, ఆర్‌అండ్‌బీ శాఖ స్పెషల్‌ సెక్రటరీ విజయేంద్ర అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ గౌతమ్‌తో కలిసి తాగునీటి సరఫరాపై మున్సిపల్‌ కమిషనర్లు, మండల ప్రత్యేకాధికారులు, మిషన్‌ భగీరథ, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజినీర్లు, ఎండీఓలతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. రక్షేతస్థాయిలో తాగునీటి సరఫరా పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులొచ్చినా వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. ప్రత్యామ్నాయ చర్యలతో నీటిఎద్దడిని నివారించాలన్నారు. చేతి పంపులు, బోరు మోటార్లు, పైప్‌లైన్ల మరమ్మతులు చేయించాలన్నారు. అన్ని వనరులను వినియోగించుకోవాలని సూచించారు. టోల్‌ ఫ్రీ కాల్‌సెంటర్‌ నంబర్లు ప్రజలకు తెలియజేయాలన్నారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ వేసవిలో నీటి సమస్య రాకుండా చూడాలన్నారు. కలెక్టర్‌ గౌతమ్‌ మాట్లాడుతూ ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా చూసే బాధ్యత మనందరిది అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ అభిషేక్‌అగస్త్య, సీఈవో దిలీ్‌పకుమార్‌, డీపీవో వెంకటయ్య, డీఆర్డీఏ పీడీ సాంబశివరావు, మున్సిపల్‌ కమిషనర్లు పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2024 | 12:58 AM