Share News

ఎల్లమ్మ ఆలయంలో చోరీ

ABN , Publish Date - Sep 10 , 2024 | 11:42 PM

ఆలయంలో గుర్తుతెలియని దుండగులు చొరబడి చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన శామీర్‌పేట్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని లక్ష్మాపూర్‌ గ్రామంలోని ఎల్లమ్మ ఆలయంలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

ఎల్లమ్మ ఆలయంలో చోరీ

  • బంగారు, వెండి ఆభరణాలు అపహరణ

మూడుచింతలపల్లి, సెప్టెంబరు 10: ఆలయంలో గుర్తుతెలియని దుండగులు చొరబడి చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన శామీర్‌పేట్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని లక్ష్మాపూర్‌ గ్రామంలోని ఎల్లమ్మ ఆలయంలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... లక్ష్మాపూర్‌ గ్రామ పరిధిలో ఉన్న ఎల్లమ్మ తల్లి ఆలయంలో అర్చకులు రోజువారి లాగే పూజలు నిర్వహించి అనంతరం అలయానికి తాళం వేసి వెళ్లారు. కాగా అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ఆలయ ప్రధాన ద్వారానికి వేసిన తాళాన్ని విరగొట్టి ఆలయంలోకి చొరబడి సూమారు రూ.లక్షా 50వేలు విలువ చేసే బంగారు ఆభరణాలను (అమ్మవారి ముక్కు పుడక, శఠగోపం, పళ్ళెం, కిరీటాలు) అపహరించారు. సోమవారం ఉదయం ఆలయ అర్చకులు వచ్చి చూడగా ఆలయానికి ఉన్న రెండు ప్రధాన ద్వారాల తాళాలు పగలగొట్టి ఉండడంతో అనుమానం వచ్చి లోపలికి వెళ్లిచూడగా అమ్మవారి ఆభరణాలు కనిపించలేదు. దీంతో ఆలయంలో చోరీ జరిగిందని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Sep 11 , 2024 | 07:54 AM