Share News

ఎలకా్ట్రనిక్‌ షాపులో చోరీ

ABN , Publish Date - Jun 12 , 2024 | 12:02 AM

శంకర్‌పల్లిలోని బాలాజీ ఎలక్ర్టానిక్‌ దుకాణంలో దొంగలు పడ్డారు. మంగళవారం తెల్లవారుజామున 3.48 గంటలకు హైదరాబాద్‌ ప్రధాన రోడ్డులో గల దుకాణం షట్టర్‌ తాళాలు విరగ్గొట్టి ముగ్గురు దుండగులు లోపలికి ప్రవేశించారు. కౌంటర్‌ తాళాలు విరగ్గొట్టి రూ.లక్షా పది వేలు దోచుకెళ్లారు.

ఎలకా్ట్రనిక్‌ షాపులో చోరీ

శంకర్‌పల్లి, జూన్‌ 11: శంకర్‌పల్లిలోని బాలాజీ ఎలక్ర్టానిక్‌ దుకాణంలో దొంగలు పడ్డారు. మంగళవారం తెల్లవారుజామున 3.48 గంటలకు హైదరాబాద్‌ ప్రధాన రోడ్డులో గల దుకాణం షట్టర్‌ తాళాలు విరగ్గొట్టి ముగ్గురు దుండగులు లోపలికి ప్రవేశించారు. కౌంటర్‌ తాళాలు విరగ్గొట్టి రూ.లక్షా పది వేలు దోచుకెళ్లారు. కాగా, దొంగలు మిగతా ఎలక్ర్టానిక్‌ వస్తువులను మాత్రం ఎత్తుకెళ్లలేదు. ఉదయం దుకాణం తెరిచేందుకు యజమాని శ్రీనివాస్‌ రాగా.. దుకాణం తాళాలు తీసి ఉండటంతో పా టు గా షెట్టర్‌ లేపి ఉండటం గమనించాడు. వెంటనే శంకర్‌పల్లి పోలీసులకు సమాచారం అందించాడు. డిటెక్టివ్‌ సీఐ నాగరాజు, ఎస్సైలు సంతో్‌షరెడ్డి, సత్యనారాయణలు సంఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. ఫింగర్‌ ప్రింట్‌ ఆధారాలు సేకరించారు.

Updated Date - Jun 12 , 2024 | 08:51 AM