Share News

కిరాణా షాపులో చోరీ

ABN , Publish Date - Jun 03 , 2024 | 12:04 AM

ఇబ్రహీంపట్నం టౌన్‌ మంచాల రోడ్డులో శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు ఓ కిరాణా షాపులో చొరబడి లాకర్‌లో ఉన్న ఐదు లక్షల రూపాయల నగదు, తులం బంగారు నాణెం ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. మంచాల రోడ్డులో గుద్దేటి నగేష్‌ కిరాణ షాపు నడుపుతున్నాడు.

కిరాణా షాపులో చోరీ

ఐదు లక్షల నగదు, తులం బంగారం అపహరణ

ఇబ్రహీంపట్నం, జూన్‌ 2: ఇబ్రహీంపట్నం టౌన్‌ మంచాల రోడ్డులో శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు ఓ కిరాణా షాపులో చొరబడి లాకర్‌లో ఉన్న ఐదు లక్షల రూపాయల నగదు, తులం బంగారు నాణెం ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. మంచాల రోడ్డులో గుద్దేటి నగేష్‌ కిరాణ షాపు నడుపుతున్నాడు. కాగా, షాపు పైనే వారు నివాసం ఉంటున్నారు. ఈక్రమంలో శనివారం రాత్రి షాపు మూసిన తర్వాత ఇంటికి తాళం వేసి భార్య పద్మావతితో కలిసి నగరంలోని చంపాపేట్‌లో ఉంటున్న పిల్లల దగ్గరకు వెళ్లారు. ఆదివారం ఉదయం వచ్చి చూసేసరికి షాపు వెనకాల డోరు తాళాలు పగులగొట్టి ఉన్నాయి. వెంటనే షాపులోకి వెళ్లి చూడగా.. లాకర్‌ తాళాలు పగులగొట్టి ఐదు లక్షల రూపాయల నగదు, తులం బంగారు నాణెంను ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వచ్చి పరిశీలించారు. ఈమేరకు ఘటనా స్థలాన్ని ఏసీపీ కేపీవీ రాజు పరిశీలించారు. క్లూస్‌ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మారయ్య తెలిపారు.

Updated Date - Jun 03 , 2024 | 12:04 AM