యువకుడు అదృశ్యం
ABN , Publish Date - Jun 27 , 2024 | 12:16 AM
యువకుడు అదృష్యమైన సంఘటన షాబాద్ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ కాంతారెడ్డి తెలిపిన వివరాల మేరకు.. వరంగల్‌కు చెందిన ఆలకుంట్ల ఏలియా (24) మూడు నెలల క్రితం షాబాద్‌కు కేబుల్ పనులు చేయడానికి వచ్చాడు.

షాబాద్, జూన్ 26 : యువకుడు అదృష్యమైన సంఘటన షాబాద్ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ కాంతారెడ్డి తెలిపిన వివరాల మేరకు.. వరంగల్‌కు చెందిన ఆలకుంట్ల ఏలియా (24) మూడు నెలల క్రితం షాబాద్‌కు కేబుల్ పనులు చేయడానికి వచ్చాడు. అయితే, అతడు ఏప్రిల్ 22న ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బటయకు వెళ్లిపోయాడు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. అతడికి ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది. నెంబర్ 9701750779 ఎవరూ ఎత్తడంలేదు. మామ బక్కయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.