నిరుపేదల సంక్షేమమే ధ్యేయం
ABN , Publish Date - Nov 28 , 2024 | 12:01 AM
నిరుపేదల సంక్షేమం, కల్వకుర్తి నియోజకవర్గ సమగ్రాభివృద్ధే ఐక్యత ఫౌండేషన్ ధ్యేయమని టాస్క్ సీవోవో, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి అన్నారు. ఆమనగల్లు పట్టణంలోని శ్రీలక్ష్మీ గార్డెన్‌లో 9 రోజులపాటు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా కంటి వైద్యశిబిరం బుధవారం సాయంత్రం ముగిసింది.

ఆమనగల్లు, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): నిరుపేదల సంక్షేమం, కల్వకుర్తి నియోజకవర్గ సమగ్రాభివృద్ధే ఐక్యత ఫౌండేషన్ ధ్యేయమని టాస్క్ సీవోవో, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి అన్నారు. ఆమనగల్లు పట్టణంలోని శ్రీలక్ష్మీ గార్డెన్‌లో 9 రోజులపాటు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా కంటి వైద్యశిబిరం బుధవారం సాయంత్రం ముగిసింది. రాఘవేందర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శిబిరంలో వైద్య సేవలు, కంటి చికిత్సలు అందించిన చెన్నై శంకరన్ నేత్రాలయ వైద్యులు, సిబ్బందిని సత్కరించి అభినందించారు. కంటి చికిత్సలు, పరీక్షలు చేయించుకున్న వారితో ఆయన సమావేశమై శిబిరం నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. మెగా వైద్య శిబిరం ద్వారా కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన 4 వేల మందికి కంటి పరీక్షలు నిర్వహించి 2,800 మందికి ఉచితంగా కంటి అద్దాలు అందించినట్లు వివరించారు. కంటి శుక్లాలు ఉన్న 150 మందికి కంటి ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేసినట్లు చెప్పారు. టాస్క్ ద్వారా యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి, ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందన్నారు. శంకరన్ నేత్రాలయ వైద్యులు డాక్టర్ శంకర్, డాక్టర్ ఆస్తా, రాజు, ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.