Share News

వందశాతం పన్నుల వసూళ్లే లక్ష్యం

ABN , Publish Date - Mar 27 , 2024 | 12:05 AM

అన్ని గ్రామాల్లో వందశాతం పన్నుల వసూళ్లే లక్ష్యంగా పనిచేయాలని డీఎల్పీవో సతీ్‌షరెడ్డి తెలిపారు. మంగళవారం చేవెళ్ల గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు.

వందశాతం పన్నుల వసూళ్లే లక్ష్యం

చేవెళ్ల డీఎల్పీవో సతీ్‌షరెడ్డి

చేవెళ్ల, మార్చి 26 : అన్ని గ్రామాల్లో వందశాతం పన్నుల వసూళ్లే లక్ష్యంగా పనిచేయాలని డీఎల్పీవో సతీ్‌షరెడ్డి తెలిపారు. మంగళవారం చేవెళ్ల గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ చేవెళ్ల డివిజన్‌ పరిధిలోని అన్ని గ్రామాల్లో వందశాతం ఇంటిపన్ను వసూళ్లు చేయాలని కార్యదర్శులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. కొన్ని చిన్న గ్రామాల్లో వందశాతం పన్నులు వసూలైనట్లు చెప్పారు. చేవెళ్ల మండలంలో రూ.కోటీ 91లక్షల 13వేల 111 పన్నుల వసూళ్లే లక్ష్యం కాగా, ఇప్పటివరకు రూ.కోటీ 62లక్షల 4వేల 614 వసూలైనట్లు చెప్పారు. అలాగే షాబాద్‌ మండలంలో లక్ష్యం రూ.కోటీ 3లక్షల 16వేల 994 కాగా, రూ.82లక్షల 44వేల 484 వసూలైనట్లు చెప్పారు. మొయినాబాద్‌ మండలంలో రూ.4కోట్ల 57లక్షల 80వేల 658 లక్ష్యం కాగా, రూ.3కోట్ల 51లక్షల 51వేల 720 వసూలయ్యాయి. శంకర్‌పల్లి మండలంలో రూ.3కోట్ల 57లక్షల 87వేల 70లకు గాను రూ. 2కోట్ల 63లక్షల 65వేల 450 వసూలయ్యాయి. శంషాబాద్‌ మండలంలో లక్ష్యం రూ.2కోట్ల 95లక్షల 29వేల 87 కాగా, రూ. 2కోట్ల 50లక్షల 81వేల 362 వసూలు చేసినట్లు చెప్పారు. ఈ నెలాఖరు వరకు వందశాతం పన్నులు వసూళ్లు చేయాలని కార్యదర్శులను డీఎల్పీవో ఆదేశించారు. ఇంటిపన్నులు చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని సూచించారు. గ్రామాల్లోని ప్రజలు సైతం గ్రామ పంచాయతీ అధికారులకు సహకరించాలని కోరారు. సమావేశంలో చేవెళ్ల ఎంపీవో విఠలేశ్వర్‌, చేవెళ్ల గ్రామ కార్యదర్శి వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 27 , 2024 | 12:05 AM