Share News

ఉమ్మడి జిల్లాలో ఠారెత్తిస్తున్న ఎండలు

ABN , Publish Date - Mar 28 , 2024 | 11:52 PM

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎండలు హడలెత్తిస్తున్నాయి. గురువారం మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఉమ్మడి జిల్లాలో ఠారెత్తిస్తున్న ఎండలు

మేడ్చల్‌ జిల్లాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదు

బాలానగర్‌లో 42.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత

(ఆంరఽధజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి) : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎండలు హడలెత్తిస్తున్నాయి. గురువారం మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తొలిసారి ఈ వేసవి సీజన్‌లో ఉమ్మడి జిల్లాలో 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. అత్యధికంగా మేడ్చల్‌ జిల్లా బాలానగర్‌లో 42.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే కుత్భుల్లాపూర్‌, కూకట్‌పల్లిలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లా నాగోల్‌లో 41.7 డిగ్రీలు, మియాపూర్‌లో 41.5, మొయినాబాద్‌ మండలం చిలుకూరు, షాబాద్‌లలో 41.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మొయినాబాద్‌ మండలం కేతిరెడ్డిపల్లిలో 41.2 డిగ్రీలు, రెడ్డిపల్లిలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వికారాబాద్‌ జిల్లా బంట్వారం మండలం నాగారం, తాండూరు, యాలాల, కులకచర్లలో అత్యధికంగా 40.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే రెండు రోజుల పాటు ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

Updated Date - Mar 28 , 2024 | 11:52 PM