Share News

పోస్టల్‌ బ్యాలెట్‌ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలి

ABN , Publish Date - Mar 28 , 2024 | 11:33 PM

లోక్‌సభ ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర సిబ్బందికి అమలు చేసే పోస్టల్‌ బ్యాలెట్‌ విధానాన్ని అధికారులు పకడ్బందీగా అమలు చేయాలని మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ గౌతమ్‌ అన్నారు.

పోస్టల్‌ బ్యాలెట్‌ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలి
సమావేశంలో మట్లాడుతున్న కలెక్టర్‌ గౌతమ్‌

మేడ్చల్‌, మార్చి 28(ఆధ్రజ్యోతి ప్రతినిధి): లోక్‌సభ ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర సిబ్బందికి అమలు చేసే పోస్టల్‌ బ్యాలెట్‌ విధానాన్ని అధికారులు పకడ్బందీగా అమలు చేయాలని మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ గౌతమ్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో పోస్టల్‌ బ్యాలెట్ల వినియోగంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చన్నారు. దీనిపై అధికారులు, ఉద్యోగులు సరైన అవగాహన కలిగి ఉండి ఓటు వృథా పోకుండా సరైన పార్మాట్‌లో ఓటు వేయాలన్నారు. మొదట అందుకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం సీఈవో కార్యాలయ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలను ఎస్‌ఐసీలో పొందుపరిచి దరఖాస్తు చేసుకోచ్చని తెలిపారు. ఎన్నికల విధులు నిర్వహించే జిల్లా స్థాయి అధికారులు ఈ విషయంపై జాగ్రత్తలు తీసుకుని ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బంది అంతా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటుహక్కును వినియోగించుకునేలా చూడాలన్నారు. మే 6వ తేదీ వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తు స్వీకరిస్తామన్నారు. జిల్లాలో ఎన్నికల సిబ్బంది అందరూ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ విజయేందర్‌రెడ్డి, డీఆర్వో హరిప్రియ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2024 | 11:33 PM