Share News

వడ్డీ డబ్బులు చెల్లించలేదని ఆటో డ్రైవర్‌ను చితకబాదిన వ్యక్తి రిమాండ్‌

ABN , Publish Date - Mar 28 , 2024 | 11:55 PM

తీసుకున్న అప్పుకు వడ్డీ డబ్బులు చెల్లించలేదని ఆటో డ్రైవర్‌ను చితకబాదిన వ్యక్తిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపినట్లు తాండూరు అర్బన్‌ సీఐ సంతోష్‌ కుమార్‌ తెలిపారు.

వడ్డీ డబ్బులు చెల్లించలేదని ఆటో డ్రైవర్‌ను చితకబాదిన వ్యక్తి రిమాండ్‌
మీడియాకు వివరాలు వెల్లడిస్తున్న సీఐ

తాండూరు, మార్చి 28: తీసుకున్న అప్పుకు వడ్డీ డబ్బులు చెల్లించలేదని ఆటో డ్రైవర్‌ను చితకబాదిన వ్యక్తిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపినట్లు తాండూరు అర్బన్‌ సీఐ సంతోష్‌ కుమార్‌ తెలిపారు. రాజీవ్‌ కాలనీకి చెందిన బాధితుడు ఆటో డ్రైవర్‌ బాలయ్య నాలుగు నెలల కిందట గాంధీనగర్‌కు చెందిన మ్యాతరి రవి దగ్గర రూ.5వేలు అప్పు తీసుకున్నాడు. ప్రతీనెల రూ.500లు వడ్డీ చెల్లిస్తున్నాడు. ఒక నెలకు సంబంధించి వడ్డీ చెల్లింపులో ఆప్యం జరగడంతో ఈనెల 25న బాలయ్యను మ్యాతరి రవి ఇంటికి పిలిపించి గేటు తలుపులు మూసివేసి చేతులను కట్టెలతో కొడుతూ దుర్భాషలాడుతూ చంపేస్తానని బెదిరించాడు. ఈ ఘటన మ్యాతరి రవి తన కొడుకుతో ఫోన్‌లో వీడియో తీయించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌ పంపినట్లు సీఐ తెలిపారు.

Updated Date - Mar 28 , 2024 | 11:55 PM