Share News

ధ్యాన మార్గం విశ్వశాంతికి దోహదం

ABN , Publish Date - Dec 27 , 2024 | 11:51 PM

భారతీయుల ధ్యాన మార్గం విశ్వశాంతికి దోహద పడుతుందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విశాఖపట్నం పార్లమెంట్‌ సభ్యుడు ఎం.శ్రీభరత్‌ అన్నారు.

ధ్యాన మార్గం విశ్వశాంతికి దోహదం
ధ్యాన మహాయాగం వేడుకల్లో మాట్లాడుతున్న విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్‌

విశాఖ ఎంపీ శ్రీభరత్‌

కడ్తాల్‌, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి ): భారతీయుల ధ్యాన మార్గం విశ్వశాంతికి దోహద పడుతుందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విశాఖపట్నం పార్లమెంట్‌ సభ్యుడు ఎం.శ్రీభరత్‌ అన్నారు. ధ్యానం ద్వారా మానసిక ఒత్తిళ్లను అధిగమించవచ్చని ఆయన పేర్కొన్నారు. కడ్తాల మహేశ్వర మహాపిరమిడ్‌ను శుక్రవారం ఆయన సందర్శించి ధ్యాన గురువు సుభాష్‌ పత్రీజీకి నివాళులర్పించారు. విశాఖపట్నంలో ఇలాంటి పిరమిడ్‌ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. మనసులోని వ్యతిరేక భావాలు, చెడు ఆలోచనలు తొలగిపోవడానికి ధ్యానం ఎంతగానో ఉపకరిస్తుందన్నారు.

అట్టహాసంగా కొనసాగుతున్న వేడుకలు

ధ్యాన మహాయాగం-3 వేడుకలను 7వ రోజు శుక్రవారం అట్టహాసంగా నిర్వహించారు. ధ్యానులు, సాధకులు, సందర్శకులు, పిరమిడ్‌ మాస్టర్లు, ఆధ్యాత్మిక వేత్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. కార్యక్రమంలో పిరమిడ్‌ స్పిరిచ్చ్యువల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ కోర్పోలు విజయభాస్కర్‌రెడ్డి, ధ్యాన గురువు పరిణతి పత్రీజీ, ట్రస్ట్‌ సభ్యులు సాంబశివరావు, హన్మంత రావు, మాధవి, దామోదర్‌రెడ్డి, లక్ష్మి, అన్మా్‌సపల్లి మాజీ సర్పంచ్‌ శంకర్‌, పీఎ్‌సఎ్‌సఎం అధ్యక్షులు సరోజ, సంగమేశ్వర్‌, గణేశ్‌, దీప్తి, అనురాఽధ, మారం శివప్రసాద్‌, భాస్కరానంద, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2024 | 11:51 PM