Share News

రాత్రికి రాత్రి పార్కు స్థలం మాయం!

ABN , Publish Date - May 16 , 2024 | 12:53 AM

ఘట్‌కేసర్‌ మండలం చౌదరిగూడ పంచాయతీ పరిధిలోని శ్రీనివాసకాలనీలో పార్కు స్థలం మాయమైంది.

రాత్రికి రాత్రి పార్కు స్థలం మాయం!
పంచాయతీ బోర్డు చెరిపేసి పేరు రాసుకున్న ప్రైవెటు వ్యక్తి

గ్రామ పంచాయతీ బోర్డులు చెరిపేసి ప్రైవేట్‌ వ్యక్తుల పేర్లు

లే అవుట్‌లోని బావిని పూడ్చి పార్కు చేస్తే ఆక్రమించారంటూ కాలనీ వాసుల ఆందోళన

పంచాయతీ బోర్డుల మాయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాం : చౌదరిగూడ పంచాయతీ కార్యదర్శి శశికుమార్‌

ఘట్‌కేసర్‌, మే 15 : ఘట్‌కేసర్‌ మండలం చౌదరిగూడ పంచాయతీ పరిధిలోని శ్రీనివాసకాలనీలో పార్కు స్థలం మాయమైంది. గ్రామ పం చాయతీ ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించడమే కాకుండ దర్జాగా తన సొంత జాగ అని పేరు రాసుకున్నారు. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. చౌదరిగూడ పంచాయతీలో సర్వే నంబర్లు 726, 727, 729 లలోని 3.13ఎకరాల భూమిని గతంలో దేశం అంజయ్య, దేశం మల్లేష్‌ల వద్ద సుగుణాకర్‌రెడ్డి అనే వ్యక్తి కొని లే అవుట్‌ చేశాడు. దీని ని 1975లోనే లే అవుట్‌ చేసినట్లు రికార్డుల ను బట్టి తెలుస్తోంది. ఈ లే అవుట్‌లో 142 ప్లాట్లు చేశారు. ఇందులో అప్పట్లో పాడు బడిన బావి ఉండేది. వెంచర్‌ నిర్వాహకులు దీన్ని లే అవుట్‌లో ఓపెన్‌ స్పేస్‌గా చూపారు. దీంతో కాలనీ వాసులు చెత్త వేస్తూ పోవడం తో మురుగు నీరు చేరి దుర్వాసన వస్తోం ద ని, అలాగే జనావాసాల్లో బావి ప్రమాదకరం గానూ ఉందని కాలనీ వాసులు బావిని పంచాయతీ సూచనలతో పూ డ్చివేసి చదును చేశారు. 400చదరపు గజాల స్థలం కావడంతో ఆ జాగపై అక్రమార్కుల కన్నుపడింది. ఇక్కడ గజం స్థలం రూ.30వేలకు పైగానే ఉంది. ఏకంగా రూ.1.2కోట్లు విలువైన పంచాయతీ స్థలాన్ని ఆ క్రమించుకునేందుకు కుట్ర చేస్తున్నారని కాలనీవాసులు అంటున్నారు. ఇది పార్కు స్థలమే అని పంచాయతీ బోర్డు సైతం పాతింది. ఆరు నెలలు అంతా సజావుగానే ఉన్నా ఇప్పుడు కొందరు రంగంలోకి దిగి ఈ భూమి తమదంటూ పం చాయతీ నిర్మించిన ప్రహరీని, బోర్డును, రాతలను రాత్రికి రాత్రే తొలగించి తమ పేర్లు రాసుకున్నారు. ఇదంతా చూసిన కాలనీవాసులు అవాక్కయ్యారు. ఆరు నెలలుగా ఉన్న బోర్డులు రాత్రికి రాత్రే మాయం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. ప్రజా అవసరాలకు చదునుచేసిన స్థలం ఆక్రమిండంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని కోరుతున్నారు.

బాధ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశాం : శశికుమార్‌, పంచాయతీ కార్యదర్శి, చౌదరిగూడ

పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్లు 726, 727, 729లలోని శ్రీనివాస కాలనీలోని పార్కు స్థలంలో పంచాయతీ ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించి ప్రైవేట్‌ వ్యక్తులు స్థలం మాదంటూ పేర్లు రాసుకు న్నారు. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. ఈ కబ్జాయత్నంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయాం. అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.

Updated Date - May 16 , 2024 | 12:53 AM