Share News

ముగిసిన మిస్‌ గుజరాతీ తెలంగాణ-2024 వేడుక

ABN , Publish Date - Apr 30 , 2024 | 12:41 AM

శంషాబాద్‌లోని డిసూరి ఎరీనా కన్వెన్షన్‌లో మిస్‌ గుజరాతీ తెలంగాణ వేడుకలు సోమవారం రాత్రి ముగిశాయి.

ముగిసిన మిస్‌ గుజరాతీ తెలంగాణ-2024 వేడుక
మిస్‌ గుజరాతీ తెలంగాణ-2024 విజేతలు

శంషాబాద్‌, ఏప్రిల్‌ 29: శంషాబాద్‌లోని డిసూరి ఎరీనా కన్వెన్షన్‌లో మిస్‌ గుజరాతీ తెలంగాణ వేడుకలు సోమవారం రాత్రి ముగిశాయి. మిస్‌ గుజరాతీ తెలంగాణ-2024 విన్నర్‌గా విధి ఉదేశి నిలిచారు. ఫస్ట్‌ రన్నర్‌పగా కాంచన్‌ సంపత్‌, సెకండ్‌ రన్నర్‌పగా క్రీమాగాంధీ ఎంపికయ్యారని నిర్వాహకులు తెలిపారు. గుజరాతీల కోసం 2023 డిసెంబర్‌ 3 నుంచి వివిధ స్థాయిల్లో 147రోజుల పాటు జరిగిన ఈ అతిపెద్ద ఈవెంట్‌లో తెలంగాణలో నివాసం ఉంటున్న గుజరాతీలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 21మంది ఫైనలిస్టులు ర్యాంప్‌ వాక్‌ చేశారు. మిసెస్‌ గుజరాతీ(40యేళ్లలోపు) ఈవెంట్‌లో 12 మంది ఫైనలిస్టులు పాల్గొన్నారు. శ్రీమతి గుజరాతీ తెలంగాణ-2024 విజేతగా భూమికేతన్‌షా, ఫస్ట్‌ రన్నర్‌పగా కాంచన్‌సంపత్‌, సెకండ్‌ రన్నర్‌పగా జ్యోతిపరేఖ్‌లు నిలిచారని నిర్వాహకులు వెల్లడించారు.

Updated Date - Apr 30 , 2024 | 12:41 AM