Share News

అదుపు తప్పి లారీ బోల్తా

ABN , Publish Date - May 16 , 2024 | 12:23 AM

అదుపుతప్పి లారీ బోల్తాపడిన సంఘటన మండల పరిధిలోని అంతారం స్టేజి సమీపంలో బుధవారం చోటుచేసుకుంది.

అదుపు తప్పి లారీ బోల్తా

బీర్‌ కాటన్లను తరలిస్తుండగా ఘటన

షాబాద్‌, మే 15 : అదుపుతప్పి లారీ బోల్తాపడిన సంఘటన మండల పరిధిలోని అంతారం స్టేజి సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు, వాహనదారులు తెలిపిన వివరాల మేరకు.. ఉదయం చేవెళ్ల నుంచి షాద్‌నగర్‌ వైపు వెళ్తున్న లారీ బోల్తాపడి ఉంది. అందులో ఉన్న డ్రైవర్‌, క్లీనర్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే, లారీలో బీర్లు ఉండడం గమనించిన వాహనదారులు వెళ్లి గమనించారు. వెంటనే డ్రైవర్‌ పోలీసులకు ఫోన్‌ చేయడంతో చేవెళ్ల ఎక్సైజ్‌ ఎస్సై సిబ్బందితో వచ్చి బీరు బాటిల్‌ కాటన్లను వేరే లారీని రప్పించి అందులోకి లోడ్‌ చేయించి పంపించారు.

Updated Date - May 16 , 2024 | 09:47 AM