Share News

చోరీకి యత్నించిన దొంగను చితకబాదిన స్థానికులు

ABN , Publish Date - May 25 , 2024 | 11:47 PM

దొంగతనం చేసేందుకు ప్రయత్నించిన ఓ దొంగను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు .

చోరీకి యత్నించిన దొంగను చితకబాదిన స్థానికులు
విద్యుదాఘాతంతో మృతి చెందిన గేదెలు

  • పోలీసులకు అప్పగింత

వికారాబాద్‌, మే 25: దొంగతనం చేసేందుకు ప్రయత్నించిన ఓ దొంగను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్‌ పట్టణంలో అఫ్సర్‌జంగ్‌బాగ్‌ కాలనీలో ఓవ్యక్తి ఇంట్లోకి చొరబడి దొంగతనం చేసేందుకు ప్రయత్నించాడు. గమనించిన స్థానికులు అతడిని పట్టుకుని చితకబాదారు. దొంగతనానికి వచ్చిన వ్యక్తి నుంచి ఇనుపరాడ్‌, సుత్తి స్వాధీనం చేసుకుని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికిచేరుకున్న పోలీసులకు దొంగను అప్పగించారు. కాగా, స్థానికుల చేతుల్లో దెబ్బలు తిన్న ఆ ్యక్తిని చికిత్స కోసం పోలీసులు ఆసుపత్రిలో చేర్పించారు. ఇదిలా ఉంటే పట్టుబడిన వ్యక్తికి ఇంతకుముందు జరిగిన దొంగతనాలతో ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

Updated Date - May 25 , 2024 | 11:47 PM