ఆగస్టు 15లోపు రుణమాఫీ చేయాలి
ABN , Publish Date - Jun 17 , 2024 | 12:33 AM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య డిమాండ్ చేశారు.

సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య
మొయినాబాద్, జూన్ 16 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య డిమాండ్ చేశారు. ఆదివారం మండల పరిధిలోని సజ్జన్‌పల్లి గ్రామంలో మండల కార్యదర్శి శ్రీనివాస్ అధ్యక్షతన పార్టీ మండల కౌన్సిల్ సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జంగయ్య మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలల్లో పుస్తకాలు అమ్ముతున్నారని అన్నారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు. అజీజ్‌గనర్ గ్రామంలో ఇటీవల ఏఐటీయూసీ జెండాను కూల్చిన దుండగులను వెంటను అరెస్టు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కె.రామస్వామి, జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, మహిళా సంఘం జిల్లా కార్యదర్శి వడ్ల మంజుల, నాయకులు రఘునారాయణ. వెంకటయ్య, ఎండీ జలీల్, సత్యనారాయణగౌడ్, జహంగీర్, శ్యాంసుందర్, మంగళి నర్సింలు, కె.రాములు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.