బ్యాంకర్ల పనితీరుతో ప్రభుత్వానికి చెడ్డపేరు
ABN , Publish Date - Dec 22 , 2024 | 12:05 AM
బ్యాంకర్ల పనితీరు సరిగా లేకపోవడంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

బొంరా్‌సపేట్, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): బ్యాంకర్ల పనితీరు సరిగా లేకపోవడంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం నాయకులు ఎస్బీఐ బ్యాంకుకు వెళ్లారు. బ్యాంకులో రైతులు, ఖాతాదారులు ఎదుర్కొంటున్న సమస్యలను మేనేజర్‌తో నిలదీశారు. ఖాతాదారులతో దురుసుగా వ్యవహరిస్తున్నారని మేనేజర్ దృష్టికి తీసుకెళ్లారు. రుణాలను ప్రభుత్వం మాఫీ చేసినా సరైన సమయంలో చెల్లించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. స్పందించిన మేనేజర్ రైతులకు సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ జయకృష్ణ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నర్సిములుగౌడ్, నాయకులు రాంచంద్రారెడ్డి, వెంకట్రాములుగౌడ్, మల్లికార్జున్, సూర్యప్రకాశ్‌గౌడ్, నాందర్‌పూర్ మల్లికార్జున్ పాల్గొన్నారు.