బోరు మోటార్‌కు విద్యుత్ కనెక్షన్ తొలగించారని..
ABN , Publish Date - Feb 06 , 2024 | 12:00 AM
తోటి రైతులు వ్యవసాయ బోరు మోటర్ విద్యుత్ కనెక్షన్ తొలగించడంతో ఓ రైతు మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మండల పరిధిలోని తంగళ్లపల్లిలో జరిగింది. గ్రామస్తుల కథనం మేరకు..
మనస్తాపంతో రైతు ఆత్మహత్యాయత్నం
కొందుర్గు, ఫిబ్రవరి 5: తోటి రైతులు వ్యవసాయ బోరు మోటర్ విద్యుత్ కనెక్షన్ తొలగించడంతో ఓ రైతు మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మండల పరిధిలోని తంగళ్లపల్లిలో జరిగింది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన పెరుమాల్‌రెడ్డికి మూడెకరాల పొలం ఉండగా వరిని సాగు చేశాడు. ఇటీవల పొలంలో బోరు వేశాడు. అయితే, మోటరు కనెక్షన్ కోసం డీడీ కూడా కట్టాడు. విద్యుత్ అధికాఉలు ఆదివారం బోరు మోటరు కనెక్షన్ ఇచ్చారు. అయితే, 63కేవీ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ నుంచి పెరుమాల్‌రెడ్డికి కనెక్షన్ ఇవ్వడంతో లోడ్ ఎక్కువై మిగతా రైతుల మోటర్లు ఆగిపోయాయి. దాంతో ఆ రైతులు పెరుమాల్‌రెడ్డి బోరు మోటర్ కనెక్షన్‌ను తొలగించారు. మనస్తాపానికి గురైన పెరుమాల్‌రెడ్డి ఆదివారం రాత్రి పురుగులమందు తాగాడు. కుటుంబ సభ్యులు శంషాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సోమవారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పరమార్శించారు.