Share News

కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ను వెంటనే డెలివరీ చేయాలి

ABN , Publish Date - Feb 15 , 2024 | 11:49 PM

2022- 23 సంవత్సరం ఒక సంబంధించిన కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ను వెంటనే డెలివరీ చేయాలని అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్‌ రైస్‌ మిల్లర్లను ఆదేశించారు.

కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ను వెంటనే డెలివరీ చేయాలి
మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్‌

వికారాబాద్‌, ఫిబ్రవరి 15: 2022- 23 సంవత్సరం ఒక సంబంధించిన కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ను వెంటనే డెలివరీ చేయాలని అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్‌ రైస్‌ మిల్లర్లను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో పౌరసరఫరాల అధికారులు రైస్‌మిల్లర్లతో సీఎంఆర్‌ రైస్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి మాసాంతం వరకు ప్రభుత్వం ప్రకటించిన విధంగా రైస్‌ మిల్లర్లు తమ వద్ద నిలువగా ఉన్న సీఎంఆర్‌ రైసును 100శాతం ఎఫ్‌సీఐకి డెలివరీ చేయాలని ఆదేశించారు. పౌరసరఫరాలో డిప్యూటీ తహసీల్దార్లు అందరూ ప్రతీరోజు మిల్లుల వద్దకు వెళ్లి సీఎంఆర్‌ డెలివరీ అయ్యేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. నిర్దేశించిన సమయంలో డెలివరీ చేయకుంటే తక్షణ చర్యలు చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేశ్వర్‌, పౌరసరఫరాల జిల్లా మేనేజర్‌ కొండలరావు, పౌరసరఫరాల డిప్యూటీ తహసీల్దార్లు, రైస్‌మిల్లుల సంఘం అధ్యక్షులు బాలేశ్వర గుప్తా, సెక్రటరీ శ్రీధర్‌రెడ్డి, రైస్‌ మిల్లర్లు పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2024 | 11:49 PM