Share News

బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్‌ సర్కార్‌

ABN , Publish Date - Jul 31 , 2024 | 12:35 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుం దని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, జాతీయ బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు తల్లోజి ఆచారి ఆరోపించారు.

బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్‌ సర్కార్‌
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న బీజేపీ నాయకులు

రంగారెడ్డి అర్బన్‌, జూలై 30 : కాంగ్రెస్‌ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుం దని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, జాతీయ బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు తల్లోజి ఆచారి ఆరోపించారు. బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం జిల్లా కలెక్టరేట్‌ ముందు ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్‌ శశాంకకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ డిక్లరేషన్‌ పేరుతో బీసీలకు ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చ డంలో కాంగ్రెస్‌ విపలమవుతుందన్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో బీసీలకు అన్యాయం జరిగిందనన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ ఇస్తానని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి మాట నిలబెట్టుకోవా లన్నారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు దుద్దాల లక్ష్మీనారా యణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అంజన్‌కుమార్‌గౌడ్‌, ప్రతాప్‌, సురేందర్‌ యాదవ్‌, అందె బాబయ్య, కొత్త అశోక్‌గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 31 , 2024 | 12:35 AM