Share News

కేటీఆర్‌పై కేసు కుట్రపూరితం

ABN , Publish Date - Dec 19 , 2024 | 11:36 PM

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై ఫార్ములా వన్‌ కార్‌రేస్‌ విషయంలో కేవలం అభియోగాలతోనే కేసు నమోదు చేయడం అన్యాయమని, కుట్రపూరితం అని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ అన్నారు. గతంలోనే కేటీఆర్‌ ఈ అంశంపై శాసనసభలో చర్చ పెట్టాలని కోరారని, దీనికి సమాధానం చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపినట్లు గుర్తుచేశారు. ఆమనగల్లులో గురువారం జైపాల్‌యాదవ్‌ విలేకరులతో మాట్లాడారు.

కేటీఆర్‌పై కేసు కుట్రపూరితం

కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌

ఆమనగల్లు, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై ఫార్ములా వన్‌ కార్‌రేస్‌ విషయంలో కేవలం అభియోగాలతోనే కేసు నమోదు చేయడం అన్యాయమని, కుట్రపూరితం అని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ అన్నారు. గతంలోనే కేటీఆర్‌ ఈ అంశంపై శాసనసభలో చర్చ పెట్టాలని కోరారని, దీనికి సమాధానం చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపినట్లు గుర్తుచేశారు. ఆమనగల్లులో గురువారం జైపాల్‌యాదవ్‌ విలేకరులతో మాట్లాడారు. కేటీఆర్‌పై కేసు కాంగ్రెస్‌ ప్రభుత్వ కక్షసాధింపు చర్యలో భాగమన్నారు. దీనిపై శాసనసభలో సవివరమైన చర్చ జరిగితే నిజానిజాలేమిటో నిగ్గుతేలుతాయన్నారు. ఈ కేసు విషయంలో కేవలం అపోహలు సృష్టించే దిశగా కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఈ కేసు గురించి అనేక రకాల అవాస్తవాలను ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మీడియాకు ఇస్తున్నారని ఆరోపించారు.

Updated Date - Dec 19 , 2024 | 11:36 PM