Share News

అదుపుతప్పి కారు బోల్తా

ABN , Publish Date - Apr 13 , 2024 | 11:56 PM

అదుపుతప్పి కారు బోల్తాపడిన ఘటనలో తృటితో పెను ప్రమాదం తప్పింది.

అదుపుతప్పి కారు బోల్తా
ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారు

దోమ, ఏప్రిల్‌ 13: అదుపుతప్పి కారు బోల్తాపడిన ఘటనలో తృటితో పెను ప్రమాదం తప్పింది. మండలంలోని గోడుగోనిపల్లి వాగుసమీ పంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్‌నగర్‌ జిల్లా గండీడ్‌ మండలం సల్కర్‌పేటకు చెందిన ఇరిగేషన్‌ డీఈ వెంకట్‌రాములు శనివారం చేవెళ్ల మండలంలో విధులు ముగించుకొని స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో గోడుగోనిపల్లి వాగు సమీపంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పొలానికి ఏర్పాటు చేసిన కంచెను ఢీకొన్నాడు. ఈ సంఘటనలో డీఈ వెంకట్‌రాములకు స్వల్ప గాయాలయ్యాయి.

Updated Date - Apr 13 , 2024 | 11:56 PM