Share News

కారు డ్రైవర్‌ అదృశ్యం

ABN , Publish Date - Nov 28 , 2024 | 11:50 PM

కారు డ్రైవర్‌ అదృశ్యమైన సంఘటన గురువారం శంషాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోచోటు చేసుకుంది. సీఐ నరేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం....మండల పరిధిలోని నర్కూడకు చెందిన గుడెపు చంద్రయ్య, లావణ్య దంపతుల కుమారుడు గుడెపు అఖిల్‌ (25) గత కొంత కాలం నుంచి కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.

కారు డ్రైవర్‌ అదృశ్యం

శంషాబాద్‌ రూరల్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి) : కారు డ్రైవర్‌ అదృశ్యమైన సంఘటన గురువారం శంషాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోచోటు చేసుకుంది. సీఐ నరేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం....మండల పరిధిలోని నర్కూడకు చెందిన గుడెపు చంద్రయ్య, లావణ్య దంపతుల కుమారుడు గుడెపు అఖిల్‌ (25) గత కొంత కాలం నుంచి కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 26 తేదిన కొండాపూర్‌ వెళ్తునానాని వెళ్లాడు. అయుతే సాయంత్రం 8 గంటలైన ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లి లావణ్య కుమారుడికి పలుమార్లు ఫోన్‌ కాల్‌ చేసిన స్పందించలేదు. ఈ నెల 27 తేది వరకు బంధువుల,స్నేహితుల వద్ద ఎంత వెతికిన ఆచూకీ లభించలేదు. దీంతో గురువారం శంషాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తప్పిపోయిన వ్యక్తి ఒంటిపై బ్లూ కలర్‌ ఫ్యాంట్‌, షర్ట్‌ దరించి ఉన్నాడని ఎవరికైన ఆచూకీ తెలిస్తే శంషాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ను సంప్రదించాలని కోరారు. కేసు దర్యాప్తులో ఉందని సీఐ తెలిపారు.

Updated Date - Nov 28 , 2024 | 11:50 PM