Share News

చికిత్స పొందుతూ యాచకుడు మృతి

ABN , Publish Date - May 03 , 2024 | 12:00 AM

చికిత్స పొందుతూ ఓ యాచకుడు మృతిచెందిన ఘటన ఘట్‌కేసర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో గురువారం చోటుచేసుకుంది.

చికిత్స పొందుతూ యాచకుడు మృతి

ఘట్‌కేసర్‌ రూరల్‌, మే 2: చికిత్స పొందుతూ ఓ యాచకుడు మృతిచెందిన ఘటన ఘట్‌కేసర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్‌కేసర్‌ పరిసర ప్రాంతంలో భిక్షాటన చేసే యాచకుడు(72) గతనెల 27న స్థానిక బస్టాండ్‌ సమీపంలో వడదెబ్బకు సొమ్మసిల్లి పడిపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు యాచకున్ని చికిత్స నిమిత్తం ఘట్‌కేసర్‌ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. అతడిని విచారించగా సికింద్రాబాద్‌కు చెందిన హనుమంతుగా పేరు మాత్రమే చెప్పాడని, మిగతా వివరాలేమీ చెప్పలేదని పోలీసులు తెలిపారు. మెరుగైన చికిత్స నిమిత్తం నగరంలోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ హనుమంతు గురువారం సాయంత్రం మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - May 03 , 2024 | 12:00 AM