Share News

పోరు ఉత్కంఠ భరితం.. గెలిచి ఓడిన కాంగ్రెస్‌

ABN , Publish Date - Jun 04 , 2024 | 11:19 PM

మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని షాద్‌నగర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లో కాంగ్రెస్‌ పార్టీ గెలిచి ఓడినట్లయింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ స్థానం ఓట్ల లెక్కింపు మంగళవారం ఉత్కంఠభరితంగా సాగింది.

పోరు ఉత్కంఠ భరితం.. గెలిచి ఓడిన కాంగ్రెస్‌

షాద్‌నగర్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మెజారిటీ..

పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ విజయం

షాద్‌నగర్‌/షాద్‌నగర్‌ అర్బన్‌, జూన్‌ 4: మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని షాద్‌నగర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లో కాంగ్రెస్‌ పార్టీ గెలిచి ఓడినట్లయింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ స్థానం ఓట్ల లెక్కింపు మంగళవారం ఉత్కంఠభరితంగా సాగింది. మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ స్థానానికి 32 మంది అభ్యర్థులు పోటీ చేసినా.. ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల మధ్యనే పోటీ నెలకొంది. బీజేపీ అభ్యర్థి డీకే అరుణకు 5,10,747 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డికి 5,06,247 ఓట్లు, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డికి 1,54,796 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డిపై డీకే అరుణ 4,500 ఓట్ల మెజార్టితో విజయం సాధించింది. అయితే, షాద్‌నగర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లో 2,38,478 ఓట్లకుగాను 1,84,578 ఓట్లు పోలైనాయి. అందులో కాంగ్రెస్‌ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డికి 76,000 ఓట్లు, డీకే అరుణకు 68,096 ఓట్లు, మన్నె శ్రీనివాస్‌రెడ్డికి 31,560 ఓట్లు వచ్చాయి. షాద్‌నగర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ వరకు కాంగ్రెస్‌ పార్టీకి 7,904 ఓట్ల మెజారిటీ వచ్చింది. షాద్‌నగర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లో కాంగ్రెస్‌ మెజారిటీ సాధించినా.. పార్లమెంట్‌లో బీజేపీ విజయం సాధించడంతో నిరాశే మిగిలింది.

Updated Date - Jun 04 , 2024 | 11:19 PM