టీజీ అక్షరాల ఏర్పాటు అభినందనీయం
ABN , Publish Date - Feb 06 , 2024 | 12:06 AM
వాహనాల నెంబర్ ప్లేట్లపై టీజీ అనే అక్షరాలు ఉండాలని ఉద్యమ సమయంలో తాను చేసిన ప్రతిపాదనను గత పాలకులు నిర్లక్ష్యం చేశారని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రతిపాదనను అమలు చేస్తున్నందుకు ఆనందంగా ఉందని ఉమ్మడి రాష్ట్ర మాజీ హోంమంత్రి టి. దేవెందర్‌గౌడ్ అన్నారు.
మాజీ హోంమంత్రి టి. దేవెందర్‌గౌడ్
మహేశ్వరం, ఫిబ్రవరి 5 : వాహనాల నెంబర్ ప్లేట్లపై టీజీ అనే అక్షరాలు ఉండాలని ఉద్యమ సమయంలో తాను చేసిన ప్రతిపాదనను గత పాలకులు నిర్లక్ష్యం చేశారని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రతిపాదనను అమలు చేస్తున్నందుకు ఆనందంగా ఉందని ఉమ్మడి రాష్ట్ర మాజీ హోంమంత్రి టి. దేవెందర్‌గౌడ్ అన్నారు. సోమవారం తుక్కుగూడలోని ఆయన నివాసంలో విలేకర్లతో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. వాహనాల నెంబర్ ప్లేట్ల విషయమేకాకుండా ప్రజలకు సంబందించిన అనేక అంశాలలో కేసీఆర్ ప్రభుత్వం ఒంటెద్దు పోకడలకు పోయి ప్రజల మనస్సులను గాయపర్చిందన్నారు. కేంద్రం టీజీ అని గెజిట్ ఇస్తే కేసీఆర్ టీఎస్ అని మార్చారని ఆరోపించారు. ఈ ప్రతిపాదనను తాను 2008లోనే చెప్పానని గుర్తుచేశారు. నాడు ఏపీ అక్షరాలను వాహనాలపై తొలగించి టీజీ అక్షరాలు రాయాలని నవ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టామన్నారు.