Share News

మెరుగైన రవాణా కల్పించడమే లక్ష్యం

ABN , Publish Date - Nov 28 , 2024 | 12:00 AM

మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌ అన్నారు. శంషాబాద్‌ మున్సిపాలిటీలోని పద్మావతి గార్డెన్‌ నుంచి నర్కూడ వరకు రూ.18 కోట్లతో చేపట్టే 100 ఫీట్ల బీటీ రోడ్డు పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

మెరుగైన రవాణా కల్పించడమే లక్ష్యం
రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌

ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌

రూ.18 కోట్లతో చేపట్టే వంద ఫీట్ల రోడ్డుకు శంకుస్థాపన

శంషాబాద్‌ రూరల్‌, నవంబరు 27(ఆంధ్రజ్యోతి) : మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌ అన్నారు. శంషాబాద్‌ మున్సిపాలిటీలోని పద్మావతి గార్డెన్‌ నుంచి నర్కూడ వరకు రూ.18 కోట్లతో చేపట్టే 100 ఫీట్ల బీటీ రోడ్డు పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ముఖ్యంగా మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో అధిక నిధులు కే టాయిస్తోందని చెప్పారు. శంషాబాద్‌ సమీపంలోని అనేక పరిశ్రమలు ఉన్నాయని, వ్యాపార కార్యకలాపాలు కొనసాగుతాయని చెప్పారు. ప్రభుత్వం ప్రతీ గ్రామానికి బీటీ, సీసీ రోడ్ల నిర్మాణం దిశగా చర్యలు తీసుకుంటోందని చెప్పారు. అలాగే ప్రతీ గ్రామానికి రోడ్డు, బస్సు సౌకర్యం కల్పిస్తామని, రామంజాపూర్‌ నుంచి శంషాబాద్‌ బస్టాండ్‌ వరకు రోడ్డు ఇరుకుగా ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, కొందరు ప్రాణాలు కోల్పోయారని, వంద ఫీట్ల రోడ్డుగా విస్తరిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ నీరటి తన్వీరాజు, వైస్‌ చైర్మన్‌ బండి గోపాల్‌యాదవ్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ వెంకటే్‌షగౌడ్‌, కౌన్సిలర్లు అశోక్‌, వెంకటేష్‌, జహంగీర్‌ఖాన్‌, నాయకులు పారేపల్లి శ్రీనివా్‌సగౌడ్‌, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 28 , 2024 | 12:00 AM